S Sreesanth has continued being outspoken and has now hit out at former teammates Rahul Dravid and MS Dhoni for not supporting him during the crisis of the spot-fixing allegation and the subsequent ban which was slapped by the Board of Control for Cricket in India (BCCI) on him. <br />తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జట్టులో సహచర ఆటగాళ్లుగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని, రాహుల్ ద్రవిడ్ తనకు అండగా నిలబడలేదని టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో శ్రీశాంత్ ఈ విషయాన్ని వెల్లడించాడు. <br />ఐపీఎల్-2013 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాజస్ధాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ప్రాంఛైజీకి అండగా ఉన్నారే తప్ప తనకు మద్దతు ఇవ్వలేదని వాపోయాడు. <br />